చెల్లెలి ఫోన్ నంబర్ అడిగాడని.. యువకుడిని కాల్చి చంపిన అన్న

చెల్లెలి ఫోన్ నంబర్ అడిగినందుకు ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. సరదాగా మాట్లాడుకుందామని ఫోన్ చేసి పిలిచి తన స్నేహితులతో కలసి అత్యంత కిరాతకంగా కాల్చేశాడు. బయటికెళ్లిన కొడుకు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో వెతకడం ప్రారంభించిన తల్లిదండ్రులకు బుల్లెట్ గాయాలతో కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన యూపీలోని నోయిడాలో చోటుచేసుకుంది.

గ్రేటర్ పరిధిలోని బదల్‌పూర్ ఏరియా ధూమ్ మనిక్‌పూర్ గ్రామానికి చెందిన శ్రీపాల్ రావల్ కుమారుడు ప్రశాంత్(20) అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. నాలుగు నెలల కిందట ఆమె ఫోన్ నంబర్ అడిగాడు. ఆ విషయం ఆమె అన్న(కజిన్) అంకిత్‌కి తెలిసింది. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నప్పటికీ సత్సంబంధాలు లేకపోవడంతో చెల్లెలి వెంట పడుతున్నాడని తెలిసి అంకిత్ కోపంతో రగిలిపోయాడు. ప్రశాంత్‌ని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

Also Read:

ఓ రోజు అంకిత్ ఇంట్లో ఉన్న ప్రశాంత్‌కి ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. అందుకు ప్రశాంత్ తొలుత అంగీకరించలేదు. అయితే అంకిత్ ఒత్తిడి చేయడంతో వెంటనే వస్తానని ఇంట్లో చెప్పి సమీపంలోని మరో ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ అంకిత్ అతని స్నేహితులు అరుణ్, లోకేష్, మనీష్, దుష్యంత్‌ ఉన్నాు. ప్రశాంత్‌ని చూసిన వెంటనే అందరూ ఒక్కసారిగా తిట్టడం ప్రారంభించారు. అదే సమయంలో అంకిత్ తన వెంట తెచ్చుకున్న నాటుతుపాకీతో ప్రశాంత్ ఛాతీలో కాల్చేశాడు.

Read Also:

కాల్పులు జరిపిన అనంతరం అంకిత్, అతని స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన ప్రశాంత్ ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకడం మొదలుపెట్టారు. సమీపంలోని ఇంట్లో ఓ కుర్చీలో బుల్లెట్ గాయాలతో అచేతనంగా పడి ఉన్న ప్రశాంత్‌ని చూసి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో ఘజియాబాద్ తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అంకిత్, ఐదుగురు స్నేహితులను అరెస్టు చేశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here