అగ్గిరాజేస్తున్న కరోనా.. ఆస్ట్రేలియా, చైనా మధ్య మాటల యుద్ధం

విషయంలో చైనాపై గుర్రుగా ఉన్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా ఉంది. వైరస్ వ్యాప్తికి గల కారణాలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆస్ట్రేలియా డిమాండ్ చేస్తోంది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియాలో చైనా రాయబారి చెంగ్ జింగ్‌యూ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా ఉత్పత్తులు, యూనివర్సిటీలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చైనా రాయబారి వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మైర్సే పేన్ మండిపడ్డారు. కరోనావైరస్ మహమ్మారిపై దర్యాప్తు కోసం ఆస్ట్రేలియా ముందుకు రావడంతో ఆర్థిక బలప్రయోగానికి చైనా ప్రయత్నిస్తోందని హెచ్చరించారు. గతవారం

కరోనా వైరస్ మూలాలు, వ్యాప్తిపై స్వతంత్ర దర్యాప్తునకు మద్దతు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని సభ్యదేశాలను గతవారం ఆస్ట్రేలియా పిలుపునిచ్చింది. అంతేకాదు, పలు ప్రపంచ నేతలతోనూ చర్చలు జరుపుతోంది. దీనిపై చైనా విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఎదురుదాడి చేస్తోంది. ఆస్ట్రేలియన్ ఫైనాన్సియల్ రివ్యూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెంగ్ వ్యాఖ్యలతో వివాదం తారాస్థాయికి చేరింది.

‘బహుశా సాధారణ ప్రజలు మనం ఆస్ట్రేలియా వైన్ ఎందుకు తాగాలి? ఆస్ట్రేలియా బీఫ్ ఎందుకు తినాలి? అంటారు’అని చైనా రాయబారి వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా పర్యటనలపై యాత్రికులు పునరాలోచన చేసుకునే అవకాశం ఉంది.. అలాగే తమ పిల్లలను చదువులకు పంపడానికి ఇది ఉత్తమైన ప్రదేశమా? అని తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు’ అని అన్నారు.

ఎనర్జీ ఎగుమతుల తర్వాత ఆస్ట్రేలియాలో విద్య, పర్యాటకం అత్యంత కీలకమైనవి. అక్కడకు చైనా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, పర్యాటకులు వెళ్తుంటారు. వుహాన్‌లో మొదలైన కరోనా వైరస్ గురించి స్వతంత్ర దర్యాప్తునకు సూత్రప్రాయంగా తాము పిలుపునిచ్చామని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పేన్ అన్నారు. ఆర్థిక బలప్రయోగానికి సంబంధించిన ఏ అంశాన్నైనా తాము వ్యతిరేకిస్తామని, ప్రస్తుతం ప్రపంచ దేశాలు సహకారం అవసరమని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా వైన్, బీఫ్‌లకు చైనాలో మంచి డిమాండ్ ఉంది.

2018లో చైనా, ఆస్ట్రేలియా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో వైన్, బీఫ్‌ దిగుమతులను డ్రాగన్ కొంతకాలం నిలిపివేసింది. ఆస్ట్రేలియాలోని చైనా పౌరుల భద్రతకు ముప్పు ఉందని చైనా రాయబార కార్యాలయం గతంలో హెచ్చరికలు సైతం జారీచేసింది. కరోనా వైరస్ విషయంలో నిజాయతీగా జరిగే దర్యాప్తు పాత్రను బలోపేతం చేయడానికి సహకరిస్తుందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి ఉద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here