స్వామి అనుగ్రహంతో స్వగృహాన్ని పొందాలంటే ఇలా చేయాలి…

ఓ నమో వేంకటేశాయ అంటే భక్తులు కోర్కెలు తీర్చే దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. అలాంటి స్వామివారిని పూజించి తమ కోర్కెలు తీర్చుకుంటారు. అయితే ముఖ్యంగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత బాగా ప్రాచుర్యం పొందింది. ఇల్లు కట్టుకోవాలి ప్రతీ ఒక్కరి కోరిక. ఈ కోరికను తమ జీవిత లక్ష్యంగా కొందరు భావిస్తారు. అలాంటి కోరికను నెరవేర్చుకోవడానికి వెంకటేశ్వరస్వామిని పూజిస్తే తప్పకుండా ఫలిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
స్వామి అనుగ్రహంతో స్వగృహాన్ని పొందాలంటే ఇలా చేయాలి. మన శక్తి కొలది వెండితో, లేదంటే మట్టితో చేసిన ఇల్లును సిద్ధం చేసి, ఆ ఇంటి ముందు దీపం వెలిగించాలి. ఇంట్లో పూజల గదిలో ఉత్తర భాగంలో ప్రతిష్టించి ఆ ఇంటి ముందు తప్పని సరిగా రెండు దీపాలు ధరించాలి. పసుపు కుంకుమ, అక్షింతలతో రెండు పూలు పెట్టి ఇల్లే దైవంగా భావించి పూజలు చేయాలి. వెంకటేశ్వర మాకు ఇల్లు ప్రసాదించు అని కొలిస్తే తప్పకుండా ఆ ఏడుకొండలవాడే సొంతింటి కల నిజం చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here