స్వస్థలాలకు వలస కూలీలు.. ఆయా రాష్ట్రాల్లో క్వారయింటైన్ నిబంధనలు ఇవే

లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న , విద్యార్ధులు, యాత్రికులు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో లక్షలాది మంది సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. వీరిని ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రలకు వచ్చే వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్రాలు క్వారయింటైన్ నిబంధనలు వెల్లడించాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు 21 రోజుల పాటు క్యారంటైన్‌లో ఉండాలని బీహార్ రాష్ట్రం స్పష్టం చేసింది.

20 మంది కంటే ఎక్కువ సమూహానికి అనుమతించిన ఆంధ్రప్రదేశ్… అందరికి కోవిడ్- 19 పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వచ్చేవరకు రిలీఫ్ కేంద్రంలోనే ఉండాలని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో హోమ్ క్వారయింటైన్ 14 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం సూచించిన కేంద్రాల్లో 14 రోజులు క్వారయింటైన్ ఉండాలని ఒడిశా నిర్దేశించింది.

కేరళ, కర్ణాటక, లడక్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు 14 రోజుల హోమ్ క్వారయింటైన్ నిబంధనలను అమలు చేస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌కి ప్రభుత్వ అనుమతితో వచ్చే వారికి 14 రోజుల క్వారయింటైన్, అనుమతి లేకుండా వచ్చే వారికి 21 రోజుల ప్రభుత్వ క్వారయింటైన్ విధించింది. తమిళనాడులో కోవిడ్ పరీక్షలు, ఫలితాలు వచ్చే వరకు ప్రభుత్వ క్వారయింటైన్, నెగిటివ్ వస్తే 14 రోజుల హోమ్ క్వారయింటైన్ తప్పనిసరి. రాజస్థాన్ ప్రభుత్వం సైతం 14 రోజుల క్వారయింటైన్ అమలు చేస్తామని ప్రకటించింది.

వైరస్‌ వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసలుకున్న వ్యక్తులు ఆ వైరస్‌కు ప్రభావితమై ఉంటారనే కారణంతో నిర్బంధంలో ఉంచడం లేదా స్వీయ దిగ్బంధం విధించుకోవడం క్వారంటైన్‌. కదలికల్ని నియంత్రించడం దీని ముఖ్య ఉద్దేశం. ఫ్లూ లక్షణాలు కనిపించినపుడు కనీసం 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తారు. దీని వల్ల వైరస్ ఉంటే ఈ కాలంలో బయటపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here