షాక్! లాక్‌డౌన్ వేళ తెరిచిన స్కూలు.. 100 మంది విద్యార్థులు హాజరు

కరోనా మహమ్మారి నిరోధానికి దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుండగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనే ఓ పెద్ద ఉల్లంఘన జరిగింది. దేశంలో కరోనా మొదటిదశలో ఉండగానే తొలుత స్కూళ్లు అన్నింటినీ మూసివేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి పాఠశాలలు మూసే ఉన్నాయి. మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వేళ కూడా స్కూళ్లు తెరిచేందుకు ఎక్కడా సడలింపు జరగలేదు. కానీ, గుజరాత్‌లో ఓ పాఠశాలను తెరవడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా స్కూలుకు 100 మంది పిల్లలు కూడా వచ్చారు.

Also Read:

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పార్దీ ప్రాంతంలోని పాఠశాలను శనివారం తెరిచారు. ఈ విషయం విద్యాశాఖ అధికారుల వరకు వెళ్లడంతో ప్రభుత్వ ఆదేశాలు పాటించని పాఠశాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పరిషత్ పంచాయత్ సమితి ఛైర్మన్ కేడీ పదారియా వెల్లడించారు.

అయితే, తాము పాఠశాలను తెరవడంపై యాజమాన్యం ఇలా సమర్థించుకుంటోంది. లాక్‌ డౌన్‌కు ముందు విద్యార్థులంతా పరీక్షలు రాశారని.. సంబంధిత పేపర్ల మూల్యాంకనం పూర్తయి, ప్రోగ్రెస్ కార్డులు సిద్ధమయ్యాయని తెలిపారు. ఆ రిపోర్టు కార్డులు ఇచ్చేందుకే తాము స్కూల్ తెరిచామని చెప్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here