షాకింగ్‌.. క్వారంటైన్ ఆస్ప‌త్రి ఆహ‌రంలో పురుగులు.. అవాక్కైన రోగులు

మ‌హారాష్ట్రలోని పుణే న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ క‌రోనా అనుమానితుల‌తోపాటు, పాజిటివ్‌గా తేలిన వ్య‌క్తుల‌ను స‌ర్దార్ వ‌ల్లాభాయ్ ప‌టేల్ కంటోన్మెంట్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక్క‌డ అందిస్తున్న ఆహారం నాణ్య‌త లేమితో ఉంద‌ని రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆహారంలో పురుగులు వ‌స్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆస్ప‌త్రిని పుణే కంటోన్మెంట్ బోర్డు నిర్వ‌హిస్తోంది.

Must Read:

ఆస్ప‌త్రి అందించే ఆహారంలో నాణ్య‌త పాటించ‌డం లేద‌ని రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆహారంలో పురుగులు రావ‌డంతోపాటు, చ‌పాతీల్లో వెంట్రుక‌లు వ‌స్తున్నాయ‌ని పేర్కొంటున్నారు. ఆక‌లి బాధ‌కు త‌ట్టుకోలేక ఆన్‌లైన్‌లో ప్ర‌య‌త్నిస్తుంటే, కంటైన్‌మెంట్ జోన్ కావ‌డంతో డెలీవ‌రిల‌కు అధికారులు ఒప్పుకోవ‌డం లేద‌ని ఆయా వ్య‌క్తులు పేర్కొంటున్నారు.

Must Read:

ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధితో పోరాడుతున్న తాము ఇలాంటి నాసిక‌రం ఆహారంతో రోగ నిరోధ‌క శ‌క్తిని ఎలా పెంపొందిచుకోగ‌ల‌మ‌ని వాదిస్తున్నారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై దృష్టి సారించాలని అర్థిస్తున్నారు. మ‌రోవైపు ఇటీవ‌లే ఐసీయూ, కోవిడ్‌-19 రోగుల చికిత్స కోసం రూ.2.5 కోట్ల‌ను విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం న‌గ‌ర‌వ్యాప్తంగా 25 మంది ఈ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఓ స్వచ్చంద సంస్థ అందించిన ఆహారంలో పొరపాటు దొర్లిందని, ఇక మీదట పలు జాగ్రత్తలు పాటిస్తామని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here