వృద్ధ దంపతులపై పైశాచిక దాడి, భర్త మృతి.. గుంటూరు జిల్లాలో దారుణం

జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. గుంటూరు జిల్లా మండలం కాశిపాడులో పులిపాటి రాధా కృష్ణమూర్తి, అతడి భార్య వెంకట నరసమ్మ కలిసి నివసిస్తున్నారు. వీరిద్దరు చిల్లరకొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి దుకాణం ముగించుకుని ఇంట్లోకి వెళ్లగానే అప్పటికే ఇంట్లోకి చొరబడ్డ అదే దుండగుడు వారిద్దరిపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాధాకృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందగా… భార్య వెంకట నరసమ్మ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

Also Read:

దీంతో ఆమె కూడా మృతి చెందిందని భావించిన నిందితుడు ఒంటిపై ఉన్న 152 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆమె గుంటూరులో ఉంటున్న పెద్ద కుమారుడు సురేశ్‌కు ఫోన్‌ చేసి దాడి సంగతి చెప్పింది. సురేశ్ వెంటనే డయల్ 100, 108కి ఫోన్ చేయడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నరసమ్మకు అమరావతి సీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన మల్లెల గోపీని అదుపులోకి తీసుకుని విచారించారు.

Also Read:

నేరం అంగీకరించడంతో నిందితుడి ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలతో పాటు దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే గతంలో కూడా క్రోసూరు మండలం గుడిపాడు, రాజుపాలెం మండలం కొండమోడులోనూ ఇదే తరహలో జంట హత్యలు జరిగాయి. దీంతో ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులను టార్గెట్ చేసుకుని కొందరు హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో నిందితుడు మల్లెల గోపీ వెనుక ఏదైనా గ్యాంగ్ ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here