వివాహ జీవితంపై విరక్తి.. పెళ్లయిన మూడు నెలలకే యువతి ఆత్మహత్య

పెళ్లయిన మూడు నెలలకే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. కొండాపూర్‌ రాఘవేంద్ర కాలనీలో నివాసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పాండురంగారావుకు ఖమ్మం ప్రాంతానికి చెందిన సంతోషి(25)తో ఈ ఏడాది ఫిబ్రవరి 15న వివాహమైంది. పెళ్లి తర్వాత సంతోషి భర్త, అత్తమామతో కలిసి ఆమె కొండాపూర్‌లో కాపురం ఉంటోంది.

Also Read:

బుధవారం సాయంత్రం వాకింగ్‌ కోసం అపార్టుమెంట్‌ పైకి వెళ్లిన సంతోషి ఆరో అంతస్తు నుంచి కిందికి దూకేసింది. గమనించిన వాచ్‌మెన్‌.. కుటుంబ సభ్యులకు, పోలీసులు సమాచారం ఇచ్చాడు. అత్తమామలతో పాటు భర్త ప్రవర్తన నచ్చకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె రాసిన లేఖను పోలీసులు గుర్తించారు. సంతోషి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెళ్లయి మూడు నెలలు తిరగకముందే కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here