వలస కూలీలకు భారీ ఊరట.. స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్రం అనుమతి.. ఒకే నిబంధన!

కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన , యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర హోం శాఖ బుధవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకోవచ్చని సూచించింది. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించడం కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. కాగా ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. దీంతో వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు ప్రత్యేక బస్సుల్లో సొంత రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంది.

వీరు ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నారనే విషయం చెప్పడంతోపాటు.. ఈ ప్రయాణానికి వారి సొంత రాష్ట్రం అనుమతి ఇవ్వాలని కేంద్రం నిబంధన విధించింది. కోవిడ్-19 లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతి ఇస్తారు. రాష్ట్రాలు వీరికి హెల్త్ చెకప్‌లు నిర్వహించనున్నాయి.

మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రారంభమైన నాటి నుంచి వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వస్థలాలకు చేరే క్రమంలో చాలా మంది ప్రాణాలు విడిచారు. వాహనాల మీద, కాలినడక వేల కి.మీ. ప్రయాణిస్తున్నారు. వారికి ఆశ్రయం కల్పించి, ఆహారం అందించాలని కేంద్రం గతంలోనే సూచించినప్పటికీ.. వలస జీవులు మాత్రం సొంత రాష్ట్రాలకు వెళ్లడానికే మొగ్గు చూపారు.

కేంద్రం ఒప్పుకోకపోయినప్పటికీ.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను తమ రాష్ట్రానికి తీసుకెళ్తున్నాయి. దీంతో బిహార్ లాంటి రాష్ట్రాలపై ఒత్తిడి పెరిగింది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here