గ్రామ వాలంటీర్‌ని కొట్టి చంపిన దుర్మార్గులు.. విజయగగరంలో దారుణం

లాక్‌డౌన్ సమయంలో ఇంటి నుంచి బయటకు రావొద్దన్నాడని గ్రామ వాలంటీర్‌ని దారుణంగా కొట్టి చంపేసిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముగ్గురు కలసి మూకుమ్మడి గా దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో వారం రోజులపాటు నరకం అనుభవించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దారుణ ఘటన జిల్లా సాలూరులో చోటుచేసుకుంది.

పరిధిలోని పనుకువలస పంచాయతీ కందిరివలస గ్రామ వాలంటీర్‌ కోన లక్ష్మణరావు(23) ఈ నెల 18న విధుల్లో భాగంగా గ్రామంలో తిరుగుతూ ఎవరూ బయటికి రావొద్దని చెబుతున్నాడు. గ్రామానికి చెందిన చిన్నారావు అనే వ్యక్తి రోడ్డుపై తిరుగుతుండడంతో ఇంటికి వెళ్లాలని చెప్పాడు. ఆగ్రహం చెందిన చిన్నారావు నాకే చెబుతావా అంటూ వాలంటీర్ లక్ష్మణరావుతో గొడవకు దిగాడు. అప్పటితో ఆ వివాదం ముగిసింది.

Also Read:

అయితే రెండు రోజుల తరువాత 20న లక్ష్మణరావు ఒంటరిగా కనిపించడంతో చిన్నారావు, అతని తండ్రి సన్యాసి, అన్న రామకృష్ణ దాడి చేశారు. ముగ్గురు మూకుమ్మడిగా దాడి చేసి కొట్టడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు సాలూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అతని పరిస్థితి విషమించడంతో విజయనగరం జిల్లా ఆసుపత్రికి.. అక్కడి నుంచి విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మణరావు మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here