వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి: కేంద్రానికి లేఖ‌

త‌మ రాష్ట్రంలో చిక్కుకుపోయిన వ‌ల‌స కార్మికుల‌ కోసం స్పెషల్ ట్రైన్ల‌ను న‌డ‌పాల‌ని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. వ‌చ్చేనెల 3తో లాక్‌డౌన్ వ్య‌వ‌ధి ముగిసిపోతున్న క్ర‌మంలో వ‌లస కార్మికుల కోసం ముంబై, పుణే న‌గ‌రాల నుంచి రైళ్ల‌ను న‌డ‌పాల‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ కోరారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర వ్యాప్తంగా 6.5 ల‌క్ష‌ల‌మంది వ‌ల‌స కార్మికులు చిక్కుకుపోయారు. వీరంద‌రినీ షెల్ట‌ర్ హోమ్‌ల్లో ఉంచి ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు.

Must Read:

లాక్‌డౌన్ ముగిశాక వ‌ల‌స కార్మికులు ఇంకా త‌మ రాష్ట్రంలోనే ఉంటే శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌ని పవార్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు. మ‌రోవైపు ఈనెల 14న తొలిద‌శ లాక్‌డౌన్ పూర్త‌య్యాక‌, పెద్ద‌యెత్తున వ‌ల‌స కార్మికులు బాంద్రా రైల్వే స్టేష‌న్‌కు చేరుకుని, త‌మ ఊళ్ల‌కు పంపాల‌ని ఆందోళ‌న చేసిన సంగ‌తి తెలిసిందే.

Must Read:

మ‌రోవైపు మ‌హారాష్ట్ర క‌రోనా వైర‌స్ కార‌ణంగా అత‌లాకుత‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రాష్ట్రంలో 6400 మందికిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 260 మందికిపైగా మ‌ర‌ణించారు. దేశవ్యాప్తంగా అత్య‌ధిక సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు, క‌రోనా మ‌ర‌ణాలు అత్య‌ధికంగా మహారాష్ట్ర‌లోనే న‌మ‌దయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here