లిక్కర్ షాప్స్ @టాప్ ట్రెండింగ్.. మద్యంప్రియులు తెగ సెర్చ్ చేస్తున్న అంశాలివే!

లా క్‌డౌన్‌తో మూతబడ్డ వైన్ షాపులు దాదాపు నెల రోజుల తర్వాత తెరుచుకోవడంతో మద్యంప్రియుల ముఖంలో ఆనందం విరుస్తోంది. బ్యాగులు తీసుకొని ఓ నెల రోజులకు సరిపడా మద్యం తీసుకునేందుకు బయల్దేరారు. దీంతో వైన్ షాపుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. దేశంలోని పలు చోట్ల మద్యం షాపుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రమే మద్యం విక్రయాలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూగుల్‌లో ఒక రకమైన సెర్చింగ్ పెరిగింది.

ఏయే ప్రాంతాలు ఏయే జోన్లలో ఉన్నాయి? మనకు దగ్గరగా ఉన్న వైన్ షాపులేవి? రీఓపెన్ చేసిన వైన్ షాపుల జాబితా? ఇలాంటి అంశాల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. దీంతో సోమవారం (మే 4) ఉదయం నుంచి ఆయా అంశాలు గూగుల్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

నగరాల్లో నివాసం ఉంటున్న వారు ఎక్కువగా ఇలాంటి అంశాల కోసం వెతుకుతున్నారు. తమకు సమీపంలో ఉన్న వైన్ షాపుల గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లి క్యూలో నిల్చుంటున్నారు. ఈ విషయం తెలుసుకోవడానికి గూగుల్‌లో పలు రకాలుగా శోధిస్తున్నారు. కొంత మంది మద్యంప్రియులు ముందుగా నగరంలో కంటెయిన్‌మెంట్ జోన్లు ఏవో తెలుసుకొని ఆయా ప్రాంతాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వైన్ షాపులు ఉన్నాయో తెలుసుకుంటున్నారు.

మందు బాటిళ్లు దక్కించుకోవడం కోసం మద్యంప్రియుళ్లు ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు. గంటల తరబడి కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో ఎండను కూడా లెక్కచేయకపోవడం గమనార్హం. చాలా చోట్ల మద్యం కోసం ఎగబడుతున్నారు. సామాజిక దూరం ప్రశ్నార్థక మారింది. పలు చోట్ల ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

మద్యం షాపుల దగ్గర ఆడ, మగా అనే తేడా కూడా ఉండటం లేదు. నగరాల్లోని పలు వైన్ షాపుల వద్ద మగవాళ్లతో పాటు మహిళలు, యువతులు కూడా క్యూ లైన్లో నిల్చొని ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here