లిక్కర్ కిక్కు: ఒకేసారి రూ.లక్షకు కొనేశాడు.. చివర్లో ట్విస్ట్

కేంద్రం గ్రీన్ సిగ్నల్‌తో కొన్ని రాష్ట్రాలు మినహా.. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా మందుబాబులు రోడ్లెక్కారు.. మద్యం దుకాణాల ముందు క్యూలు కట్టారు. ఎక్కడ చూసినా మద్యం ప్రియులతో షాపులు కళకళలాడాయి. ఒక్కరోజులోనే సేల్స్ రికార్డ్ బ్రేక్ చేశాయి. అసలే 45 రోజలుగా చుక్క పడక నాలుకలు తడి ఆరిపోవడంతో.. గొంతు తడుపుకోవడానికి ఎగబడ్డారు. ఎండను సైతం లెక్క చేయకుండా కనీసం ఒక్క బాటిల్ అయినా తీసుకెళదామనే ఉత్సాహం కనిపించింది. మందు దొరికిందన్న ఆనందంలో కొందరు డ్యాన్సులు చేస్తే.. కొందరు మద్యం షాపులకు పూజలు చేశారు.. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే బెంగళూరుకు చెందిన మద్యం ప్రియులు అదేదో కరువు వచ్చిందుకున్నారో ఏమో రూ.లక్షల విలువ చేసే మద్యం కొనుగోలు చేశారు. ఓ వ్యక్తి రూ.52వేల విలువైన లిక్కర్ కొంటే.. మరో వ్యక్తి రూ.లక్షకు కొనుగోలు చేశాడు. మద్యం కొనుగోళ్లకు సంబంధించిన బిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలే 45 రోజుల కరువు మరి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంత భారీగా లిక్కర్ కొనుగోళ్లపై కర్ణాటకమ ఎక్సైజ్‌‌శాఖ అధికారులు మద్యం విక్రయించిన షాప్‌ ఓనర్‌పై కేసు నమోదు చేశారు.ప్రభుత్వం అనుమతించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఓ వ్యక్తికి మద్యం అమ్మరాదని నిబంధనలు చెబుతున్నాయి.

లిక్కర్ షాపు యజమానితో పాటూ ఆ బిల్లు పోస్ట్‌ చేసిన వ్యక్తిపై కూడా అధికారులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే షాప్ యజమాని వాదన మరోలా ఉంది.. 8 మంది వినియోగదారులని, కానీ ఒక కార్డు ద్వారా బిల్లు మొత్తం చెల్లించారని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఇలా భారీగా మద్యం కొనుగోలు చేసినవారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here