లాక్‌డౌన్ వేళ‌.. సొంతూరికి ఒకే ట్ర‌క్కులో 76 మంది.. మధ్యలోనే సీన్ రివ‌ర్స్‌

క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్నవేళ గ‌త నెల 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్ర ప్ర‌భుత్వం అమలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా కోట్లాదిమంది వ‌ల‌స కూలీలు చిక్కుకుపోయారు. చేయ‌డానికి ప‌ని లేక, తిన‌డానికి తిండిలేక‌ కొంత‌మంది కాలిన‌డ‌క‌నే త‌మ సొంత ఊళ్ల‌కు చేరుకుంటున్నారు. తాజాగా హ‌ర్యానాలో వ‌ల‌స కూలీలు చేసిన ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. హ‌ర్యానా నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ఒక ట్ర‌క్కులో బ‌య‌ల్దేరిన 76 మంది వ‌ల‌స కార్మికులు పోలీసుల‌కు దొరికిపోయారు.

Must Read:

ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలోని గురుగ్రామ్ వ‌ద్ద చోటు చేసుకుంది. వాహ‌న త‌నిఖీల్లో భాగంగా ఒక ట్రక్కును పోలీసులు ఆపారు. డ్రైవ‌ర్ పొంత‌న‌లేని స‌మాధానాలు చెబుతుండ‌టంతో, వాహనాన్ని త‌నిఖీ చేశారు. ట్ర‌క్కులో 76 మంది వ‌ల‌స కూలీలు ప్ర‌యాణం చేస్తున్న‌ట్లు క‌నుగొన్నారు. వెంట‌నే ఆ ట్ర‌క్కును సీజ్ చేసిన అధికారులు.. డ్రైవ‌ర్‌, ఇద్ద‌రు క్లీనర్ల‌ను అరెస్టు చేశారు. వ‌లస కూలీల‌ను షెల్ట‌ర్‌కు త‌ర‌లించారు.

Must Read:

పంజాబ్‌లోని లుథియానాలో వ‌ల‌స కూలీలు ప‌నిచేస్తున్నార‌ని తెలుస్తోంది. అక్క‌డి నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గొర‌ఖ్‌పూర్‌, మ‌హారాజ్‌గంజ్ ప్రాంతాల‌కు వెళ్లేందుకు వీరంతా డ్రైవ‌ర్‌కు రూ.3వేల‌ను ముట్ట‌చెప్పిన‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి వేగంగానే జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ రాష్ట్రంలో 1500 మంది క‌రోనా పాజిటివ్‌గా తేలారు. 24 మంది మ‌ర‌ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here