లాక్‌డౌన్ పాస్ తీసుకుని ప్రియురాలితో రాసలీలలు.. భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసి

కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలంతా నెల రోజులుగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినవారి కోసం అనుమతితో కూడిన పాస్‌లను పోలీసులు ఇస్తున్నారు. అయితే వీటిని కొందరేమో దుర్వినియోగం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అయితే ఏకంగా ఆ పాస్‌ను అడ్డం పెట్టుకుని ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. చివరికి టైమ్ కలిసిరాక భార్యకు పట్టుబడ్డాడు.

Also Read:

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన చెందిన మహేశ్(పేరు మార్చాం) ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఫార్మా స్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వటంతో అతడు వెహికల్ పాస్ తీసుకుని రోజూ ఆఫీసుకు వెళ్తున్నాడు. అయితే గతంలో రోజూ ఉదయం ఆఫీసుకి వెళ్లి సాయంత్రానికల్లా ఇంటికి తిరిగివచ్చే మహేశ్.. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి మాత్రం మహేశ్ రోజూ ఇంటికి రావడం లేదు. దీంతో భార్య ఎందుకని నిలదీయగా.. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని, అందుకే రోజూ ఇంటికి రావడం లేదని చెప్పాడు.

Also Read:

అయితే భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె రెండ్రోజుల తర్వాత మహేశ్ కొలీగ్స్‌కు ఫోన్ చేసి ఆరా తీసింది. అతడు రోజూ సాయంత్రం ఆఫీసు నుంచి వెళ్లిపోతున్నాడని వారు చెప్పడంతో ఆమె అనుమానం బలపడింది. దీంతో లోతుగా ఆరా తీయగా భర్త మరో మహిళతో పెట్టుకుని వారంలో మూడు రోజులు అక్కడికే వెళ్తున్నట్లు తెలుసుకుంది. దీంతో సైబరాబాద్ షీ టీమ్స్‌కు ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకుంది. భర్త పట్టించుకోకపోతే తనతో పాటు ఇద్దరి పిల్లల పరిస్థితి దారుణంగా ఉంటుందని, తన కాపురాన్ని మీరే నిలబెట్టాలని పోలీసులను వేడుకుంది. దీంతో పోలీసులు మహేశ్‌ను పిలిచి బుద్ధిగా ఉండాలని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here