లాక్‌డౌన్ తట్టుకోలేకపోయిన లేడీ టీచర్.. బిల్డింగ్‌ పైనుంచి దూకి..

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మే 3 వరకు రెండో విడత లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమవడంతో కొందరు మానసిక సమస్యలకు లోనవుతున్నారు. డిప్రెషన్‌లో కూరుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. డిప్రెషన్‌కి గురైన ఓ లేడీ టీచర్ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నోయిడాలో చోటుచేసుకుంది.

నోయిడాలోని సెక్టార్ 78 పరిధిలోని ఓ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న లేడీ చేసుకుంది. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న భాగవతి బిష్త్(35) లాక్‌డౌన్ కారణంగా డిప్రెషన్‌కి గురైంది. మానసికంగా కుంగిపోయిన టీచర్ తన అపార్ట్‌మెంట్ 17 వ అంతస్తు నుంచి అమాంతం దూకేసింది. తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మరణించింది.

Also Read:

సమాచారం అందుకున్న సెక్టార్ 49 పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. టీచర్ బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ సంకల్ప్ శర్మ తెలిపారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here