లాక్‌డౌన్‌: మద్యం కోసం కన్నతల్లిని చంపిన కొడుకు.. రోకలితో తలపై కొట్టి ఘోరం

జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బ్లాక్‌లో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని అత్యంత కిరాతకంగా ఓ తాగుబోతు చంపేశాడు. ఈ దుర్ఘటన శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం యామన్‌పల్లికి చెందిన మధుకర్ అనే వ్యక్తి మద్యానికి తీవ్రంగా బానిస అయ్యాడు. ఏ పనీ లేకుండా ఫూటుగా మద్యం సేవించి ఆకతాయిలా తిరుగుతూ ఉండేవాడు.

ఇతనికి ఉన్న చెడ్డ అలవాట్లతో భార్యను రోజూ వేధిస్తుండడంతో విసుగు చెందిన మొదటి భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. తర్వాత తల్లి అతడికి రెండో పెళ్లి చేసింది. అయినా ఎలాంటి మార్పు రాలేదు. కొద్ది రోజుల క్రితం రెండో భార్య కూడా వదిలి వెళ్లిపోయిందని స్థానికులు వెల్లడించారు. భార్య వెళ్లిపోయినప్పటి నుంచి మధుకర్ తల్లి రాజమ్మతో పాటే ఉంటున్నాడు.

Also Read:

ఈ క్రమంలో లాక్ డౌన్ విధించడం వల్ల అతనికి మద్యం దొరకలేదు. కొద్ది రోజులకే వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. గురువారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు కావాలని తల్లిని మధుకర్ అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో గొడవ పెద్దదై సమీపంలోని రోకలితో తల్లి తలపై మధుకర్ గట్టిగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రాజవ్వను చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయింది. దీంతో కొడుకు పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రాజవ్వ మృతదేహాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Must Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here