లాక్‌డౌన్‌తో వాయిదా పడ్డ పెళ్లి.. మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్య

తెలంగాణలోని జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లికి పెద్దలను ఒప్పించిన ప్రేమజంట అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి సిద్ధమైన ప్రేమికులకు లాక్‌డౌన్ అడ్డం పడింది. దాని కారణంగా పెళ్లి వాయిదా పడటంతో మనస్తాపానికి గురైన ఆ జంట ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read:

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన గణేష్, కంపూర్‌కు చెందిన సీతాబాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను తొలుత పెద్దలు అంగీరించకపోయినా.. వారిద్దరూ కష్టపడి ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో పెళ్లి వాయిదా పడింది. కుటుంబసభ్యుల సమక్షంలోనే నిరాడంబరంగా పెళ్లి చేయాలని ప్రేమికులు కోరగా రెండు కుటుంబాలు అంగీకరించలేదు. లాక్‌డౌన్ ముగిశాకే పెళ్లి చేస్తామని, అప్పటివరకు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు.

Also Read:

అయితే లాక్‌డౌన్‌ను అడ్డం పెట్టుకుని పెద్దలు తమ పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్నారనుకుని ప్రేమికులు మనస్తాపానికి గురయ్యారు. పెద్దలు విడదీయకముందే తామే కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here