ఈ ప్రొటీన్ వల్లే దేశంలో కరోనా మరింత వ్యాప్తి.. గుర్తించిన శాస్త్రవేత్తలు

డీ614జీగా పిలిచే సార్స్-కోవి-2 వైరస్ ప్రోటీన్ కోవిడ్- 19 వైరస్ వ్యాప్తికి మరింత సహకరిస్తుందని పరిశోధనల్లో తేలింది. దీనిపై ప్రస్తుతం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని టాటా ఇని‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ పూర్వ విద్యార్థి డాక్టర్ తన్మోయ్ భట్టాచార్యతో సహా అమెరికాకు చెందిన లాస్ అలమోస్ నేషనల్ లాబొరేటరీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దేశంలోని మొత్తం 82 వైరస్ జన్యుపరిణామాలపై ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండిస్ట్రియల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ)కి చెందిన శాస్త్రవేత్తల బృందం విశ్లేషణ చేస్తోంది.

ఈ బృందంలో భారతీయ శాస్త్రవేత్త ఎస్ఎస్ వాసన్ సైతం ఉన్నారు. దాదాపు 50 శాతం జన్యువులు కొత్త ఉత్పరివర్తనాలు కలిగి ఉన్నాయని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా, దాదాపు మూడింట రెండొంతు జాతులు ఈ ఉత్పరివర్తనాలను ప్రదర్శించినట్టు సీఎస్ఐఆర్ఓ పరిశోధనలో తేలింది.

సీఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీకి చెందిన డాక్టర్ వినోద్ సకారియాతో కలిసి సీఎస్ఐఆర్ఓ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాల గురించి అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడయిన ఫలితాలు… ప్రపంచ శాస్త్రీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

సీజనల్‌గా వచ్చే ఇన్‌ఫ్ల్యూయోంజాను పోలిన కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి గురించి తీవ్రమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ఐఆర్ఓ పాథోజెనిస్ హెడ్‌ డాక్టర్ వాసన్ వ్యాఖ్యానించారు. అయితే, కోవిడ్-19కు వ్యాక్సిన్ తయారీకి జరుగుతోన్న పరిశోధనల గురించి నిశితంగా గమనిస్తున్నామని, లాక్‌డౌన్‌లు ఎత్తివేసిన తర్వాత వైరస్ ఉత్పరివర్తనాలు ఎలా రూపాంతరం చెందుతాయే చూడాలని అన్నారు.

తాము ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి సేకరించిన 7,176 వరకు జన్యుఉత్పరివర్తనాలను విశ్లేషించామని, ఇందులో దాదాపు మూడింట రెండొంతుల ఉత్పరివర్తనాలు డీ614జీని పోలి ఉన్నాయన్నారు. భారత్‌లో మాత్రం 82 నమూనాల్లో కేవలం 48 శాతం మాత్రమే డీ614జీ జన్యువుతో పోలినట్టు సీఎస్ఐఆర్ఓకి చెందిన మరో శాస్త్రవేత్త డాక్టర్ డెనిస్ బాయర్ అన్నారు. ఆస్ట్రేలియాలోని 717 నమూనాల్లో 50 శాతం దీనితో పోలాయని పేర్కొన్నారు.

బాయర్, వాసన్ ఇటీవల కొత్తరకం కరోనా వైరస్‌కి సంబంధించిన మొదట 181 నమూనాలను విశ్లేషించి, ఫలితాలను ట్రాన్స్‌బౌండరీ అండ్ ఎమర్జెంగ్ డీసీజెస్ జర్నల్‌లో ప్రచురించారు. జన్యుపరివర్తనాల గురించి అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలపై వ్యాఖ్యానించిన వాసన్.. దీనిపై లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. పరిమిత డేటా ఆధారంగా నిర్ధారణకు రావడానికి ముందు విస్తృత పరిశోధన అవసరమన్నారు. భారత్ లేదా అమెరికాలో వైరస్ జన్యుమార్పులకు గురైన అంశం తాము గుర్తించలేదన్నారు.

మొత్తం 183 జన్యుపరిణామాల్లో డీ614జీ జాతులను బ్రెజిల్, యూరప్, మెక్సికో, వుహన్‌ నుంచి సేకరించిన వాటిలో గుర్తించామని, భారత్, ఆస్ట్రేలియాలో లేదని అన్నారు. తమ పరిశోధన పత్రం ప్రచురించిన తర్వాత ఈ రెండు దేశాల్లో జన్యుపరివర్తనం ప్రభావం గురించి పరిశోధన సాగుతుందని బాయర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మ్యుటేషన్ సుమారు రెండు వంతులుగా ఉందని, ఆస్ట్రేలియా, భారత్‌లో సగం ఉన్నట్టు సూచిస్తుందని అన్నారు. సార్స్-కోవి-2 ఆర్ఎన్ఏ వైరస్.. ఇది ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌ వ్యాప్తిని వేగవంతం చెయ్యదని వాసన్ అన్నారు. ఈ వైరస్‌లు నేర్పుగా వివిధ రూపాలను మార్చుకుని ఆతిథేయాల (మనుషులు)లోకి ప్రవేశించిన తర్వాత తీవ్రమైన వ్యాధిగా రూపాంతరం చెందుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here