రెండేళ్లుగా అత్యాచారం.. గర్భం వస్తే అబార్షన్ పిల్స్.. వంచకుడికి షాకిచ్చిన బాలిక

పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికని లోచరుచుకుని మాయమాటలు చెబుతూ రెండేళ్లుగా ఆమెపై చేస్తూ ఎంజాయ్ చేశాడో నయవంచకుడు. తీరా ఆమె గర్భం వచ్చిందని చెబితే కూల్‌గా అబార్షన్ మాత్రలు తెచ్చి మింగించేవాడు. అలా పలుమార్లు అబార్షన్ కూడా జరిగిపోయింది. ఆమెపై మోజు తీరాక పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పడంతో బాలిక దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. ప్రస్తుతం పోలీసులు వంచకుడి కోసం వెతుకుతున్నారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని లోహర్డగ జిల్లాలో వెలుగుచూసింది.

కురు ప్రాంతానికి చెందిన బాలిక సెన్హా ప్రాంతంలోని అమ్మమ్మ వాళ్లింట్లో ఉండి చదువుకుంది. ఆ సమయంలో ఘాఘ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ్‌రాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన అజిత్ ఓరం అనే యువకుడితో పరిచయమైంది. చదువులో సహకరిస్తానని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. శారీరకంగా లోచరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్లు కలసి తిరిగాడు.

Also Read:

ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ మాత్రలు తెచ్చి ఇచ్చేవాడు. మాయమాటలు చెబుతూ ఆ సంబంధం కొనసాగించాడు. పలుమార్లు ఆమె గర్భం దాల్చినా మాత్రలు ఇచ్చి పోయేలా చేసేవాడు. చివరికి ఆమెపై మోజు తీరాక పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాలిక నయవంచకుడికి అదిరిపోయే షాకిచ్చింది.

తనపై రెండేళ్లుగా అత్యాచారం చేశాడని.. గర్భం దాల్చితే గర్భనిరోధ మాత్రలు బలవంతంగా మింగించాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అజిత్‌పై అత్యాచారం, మోసం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై రేప్ కేస్ నమోదైందని తెలియడంతో అజిత్ పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్నాడు. పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here