మైనర్ బాలికపై పైశాచికం.. ఇద్దరు రేప్.. నలుగురు వీడియో తీసి..

ఉరిశిక్షలు విధిస్తున్నా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. నిత్యం దేశంలో అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వరుస అత్యాచార ఘటనలతో ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది. మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆ దారుణ ఘటనను మరికొంతమంది వీడియో తీసి పైశాచికానందం పొందిన అమానుష ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

పదమూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన మిస్రిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మిస్రిక్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బహిర్భూమికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఆరుగురు దుర్మార్గులు ఆమెను అపహరించారు. బాలికను సమీపంలోని స్కూల్ బిల్డింగ్‌లోకి లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టారు. లాక్‌డౌన్ కారణంగా ఖాళీగా ఉన్న స్కూల్ బిల్డింగ్‌లో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Also Read:

ఆరుగురిలో ఇద్దరు ఆమెను దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత మరొకరు ఆమెపై పడి తమ పశువాంఛ తీర్చుకున్నారు. మిగిలిన నలుగురు ఆ దారుణాన్ని వీడియోలు తీసి పైశాచికానందం పొందారు. ఘటనను సెల్‌ఫోన్ కెమెరాలతో వీడియోలు షూట్ చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ అమానుష ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచార కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారని.. మిగిలిన నలుగురు ఆ ఘటనను వీడియోలు తీసినట్లు గా తెలుస్తోందని ఎస్పీ కుమార్ తెలిపారు. ఆరుగురిని అరెస్టు చేశామని.. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here