మైనర్‌ బాలికతో బంధువు కామవాంఛలు.. గర్భం దాల్చడంతో గుట్టురట్టు

బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి ఆమెను మాయమాటలతో లొంగదీసుకుని గర్భవతిని చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. అనేకసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఆ కామాంధుడు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక వాడి కామ దాహానికి బలవుతూ వస్తోంది. చివరికి ఆమె గర్భం దాల్చి శరీరంలో మార్పులు రావడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందని నిలదీయగా అసలు విషయం చెప్పడంతో అంతా షాకయ్యారు.

Also Read:

తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఓ బాలికపై దగ్గరి బంధువైన ఖాశీం వలీ అనే వ్యక్తి కన్నేశాడు. అప్పటికే అతడికి పెళ్లయి పిల్లలున్నప్పటికీ కామవాంఛతో బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. వాడి కామ దాహానికి బాలిక ఇటీవల గర్భం దాల్చింది. శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని బాలికను నిలదీయగా అసలు విషయం చెప్పింది.

Also Read:

దీంతో షాకైన వారు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు ఖాశీం వలీపై నిర్భయ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దర్శి డీఎస్పీ ప్రకాశరావు, పొదిలి సీఐ శ్రీరామ్‌ తుమ్మలచెరువు గ్రామాన్ని సందర్శించారు. బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. అమాయక బాలిక జీవితాన్ని నాశనం చేసని ఖాశీంను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here