మెదక్‌లో ఘోరం.. రూ.5 వేలకు అమ్మకానికి ఆడపిల్ల!

జిల్లాలో డబ్బు కోసం శిశువును విక్రయించిన దారుణమైన ఘటన వెలుగు చూసింది. నాలుగు రోజుల వయసున్న ఓ శిశువును తల్లిదండ్రులే రూ.5 వేలకు అమ్మినట్లుగా సమాచారం. ఈ ఘటన జరిగిపోయిన అనంతరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, శిశువు ఆడపిల్ల కావడం గమనార్హం. సదరు తల్లిదండ్రులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడం.. తాజాగా మళ్లీ అమ్మాయే జన్మించడంతో వదిలించుకొనేందుకు యత్నించారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, పసికందును కన్న తల్లిదండ్రులకు ఆర్థికపర సమస్యలు ఉన్నాయని, అందుకే శిశువును అమ్మారని అంటున్నారు. మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ మండలం చిటుకుల్ తండాలో ఈ ఘటన జరిగింది.

మళ్లీ ఆడబిడ్డే పుట్టడంతో కుటుంబసభ్యులు అసంతృప్తి చెందారని తెలుస్తోంది. తమ కొడుక్కి పుట్టిన మూడో ఆడపిల్లను అమ్మేసి, తర్వాత రెండో పెళ్లి కూడా చేయాలని కుటుంబపెద్దలు నిర్ణయించినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. పసిబిడ్డను కొనుక్కోవడానికి ముందుకు వచ్చిన వారికి పిల్లలు లేకపోవడంతో ఆడపిల్లను కొనుక్కుని పెంచుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here