ముగ్గురు పిల్లల తండ్రి.. ఆరుగురు పిల్లల తల్లితో రెండో పెళ్లి.. చివరికి.

పిల్లల భవిష్యత్తు గురించి గొడవపడి కోపంలో భార్యను కొట్టిచంపేశాడో కసాయి భర్త. పిల్లల గురించి ఇద్దరి మధ్య మొదలైన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దీంతో ఆగ్రహం చెందిన భర్త కర్రతో భార్య తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి భర్త లొంగిపోయిన దారుణ ఘటన పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

జహంగీర్‌పురి ప్రాంతానికి చెందిన రైసుల్ అజాం(34) తనకంటే ఐదేళ్లు పెద్దదైన గుల్షాన్‌(39)ని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ అది రెండో వివాహమే. రైసుల్‌కి గతంలోనే పెళ్లై ముగ్గురు పిల్లలు సంతానం. గుల్షాన్‌కి కూడా గతంలోనే పెళ్లైంది. ఆమెకి మొదటి భర్త ద్వారా ఆరుగురు పిల్లలు పుట్టారు. ముగ్గురు పిల్లల తండ్రి.. ఆరుగురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకుని మాదిపూర్ ప్రాంతంలోని జేజే కాలనీలో కాపురం పెట్టాడు.

Also Read:

భార్యాభర్తలు, వారి తొమ్మిది మంది పిల్లలు ఒకే గది ఉన్న ఇంట్లో నివాసం ఉండేవారు. పిల్లల విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తుపై చర్చ ఘర్షణకు దారితీసింది. ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో కోపంతో ఊగిపోయిన రైసుల్ అజాం భార్య గుల్షాన్ తలపై కర్రతో కొట్టాడు. తలకు బలంగా దెబ్బతగలడంతో గుల్షాన్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది.

ఆమె అక్కడికక్కడే మరణించడంతో అజాం పోలీసులకు ఫోన్ చేసి భార్యతో గొడవపడి కొట్టి చంపేసినట్లు చెప్పాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ భార్య హత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భర్త అజాం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here