వాసన వస్తే జాగ్రత్త.. ఇలా కూడా కరోనా వస్తుందట!

ఎలా వ్యాప్తి చెందుతుంది? లక్షణాలేంటి? అనే విషయాల పట్ల దేశంలోని ప్రజలకు దాదాపుగా అవగాహన వచ్చింది. కానీ చాలా మంది లక్షణాలు బహిర్గతం కాకపోయినప్పటికీ కరోనా పాజిటివ్ అని తేలుతోంది. వాసనలను గుర్తించలేకపోవడం, రుచి తెలియకపోవడం అనేవి కూడా కరోనా లక్షణాలని గుర్తించారు. కాళ్ల వేళ్లు రంగు మారడం, కందిపోవడం, తాకగానే నొప్పితో విలవిల్లాడటం లాంటివి కూడా కరోనా లక్షణాలేనని యూరప్ పరిశోధకులు తేల్చారు.

కాగా సెక్స్ చేస్తే కరోనా వస్తుందా..? కోవిడ్ బారిన పడిన తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వొచ్చా? అనే అనుమానాలను కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కరోనా బారిన పడిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా.. తుంపర్లు ఎదుటి వ్యక్తి మీద పడితే అతడికి కూడా కరోనా సోకుతుంది. కాగా మనం వదలే అవపాన వాయువులు () వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతుందట. వినడానికి నవ్వొస్తున్నా ఇది నిజమే.

దగ్గుతోనే కాదు శరీరం నుంచి బయటకొచ్చే గ్యాస్ నుంచి కూడా కరోనా సోకే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో బాంబులేయొద్దని ఆస్ట్రేలియా డాక్టర్ ఆండీ టాగ్ ప్రజలను హెచ్చరించారు. కింది నుంచి గ్యాస్ వదలడం, ముఖ్యంగా దుస్తులు లేనప్పుడు వదలడం వల్ల కరోనా వ్యాప్తిం చెందుతుందని ఆయన తెలిపారు. బాంబులు వేసే టైంలోనూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఆయన సూచించారు.

ఎవరైనా దగ్గితే వారికి దూరం జరగడం లేదా.. వారిని ముఖానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకోమని చెప్పడమో చేస్తాం. మరి బాంబులేసే వారిని ఏమని వారించాలో ఏంటో మరి. సౌండ్ లేకుండా వదిలే బాంబుల వల్ల కూడా ఈ ముప్పు ఉందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here