మర్కజ్ ప్రకంపనలు.. 12 మంది తబ్లిగీలు జైలుకు

ఉ త్తరప్రదేశ్‌లో 12 మంది తబ్లిగీ జమాత్ సభ్యులను జైలుకు తరలించారు. వీరిలో తొమ్మిది మంది థాయ్‌లాండ్‌ దేశస్థులు కాగా ముగ్గురు తమిళనాడుకు చెందినవారు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్‌ భవనంలో మత సమావేశాలకు హాజరై వచ్చిన వీరు యూపీలోని ఓ మసీదులో రహస్యంగా తలదాచుకున్నారు. యూపీ పోలీసులు ఏప్రిల్‌ 2వ వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నమూనాలను వైద్య పరీక్షలు పంపించగా ఒకరికి కరోనా పాజిటివ్‌‌గా తేలింది.

తబ్లీగీల్లో ఒకరికి కరోనా సోకినట్లు తేలడంతో వారందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కరోనా సోకిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే.. తాజాగా చికిత్స పొందుతున్న వ్యక్తితో పాటు మిగతా వారందరికీ కరోనా నెగటివ్‌గా రిపోర్టు వచ్చింది. 28 రోజుల క్వారంటైన్‌ గడువు కూడా ముగియడంతో వారందరినీ పోలీసులు షాజాహాన్‌పూర్‌లోని తాత్కాలిక జైలుకు తరలించారు.

వీరంతా టూరిస్టు వీసాలతో భారత్‌కు వచ్చి నిబంధనలకు విరుద్ధంగా మత సమావేశాల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే వీరందరి పాసుపోర్టులను సీజ్‌ చేసినట్లు షాజాహాన్‌పూర్‌ జిల్లా సూపరింటెండెంట్‌ దినేష్‌ త్రిపాఠి తెలిపారు. మర్కజ్ మత సమావేశాల అనంతరం దేశమంతటా కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న దశలో ఈ మత కార్యక్రమం కారణంగా దేశంలోని చాలా ప్రాంతాలకు మహమ్మారి విస్తరించింది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here