మద్యం షాపులు మూసేయండి.. షాకిచ్చిన హైకోర్టు

లాక్‌డౌన్‌తో మూతపడిన దుకాణాలు తెరుచుకోవడంతో సంబరాలు చేసుకుంటున్న మందుబాబులకు షాకిచ్చింది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ షాపులు మూసేయాలని ఆదేశాలిచ్చింది.

మద్యం ఏమీ నిత్యవసర వస్తువు కాదని.. అలాంటప్పుడు మద్యం విక్రయాలు జరపాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడం లేదని.. అందువల్ల మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ప్రజలు ఒకచోట గుమికూడడం శ్రేయస్కరం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also Read:

లాక్‌డౌన్‌ ముగిసే వరకు అమ్మకాలు జరపొద్దని.. ఈ నెల 17 వ తేదీ వరకూ మద్యం విక్రయాలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలలో విక్రయాలకు సంబంధించి గడచిన 48 గంటల వీడియోను పరిశీలించిన కోర్టు.. వెంటనే అమ్మకాలు ఆపేయాలని స్పష్టం చేసింది. అయితే ఆన్‌లైన్‌ విక్రయాలు.. హోమ్ డెలివరీ వంటి విధానాలను పరిశీలించాలని సూచించింది. అప్పటి వరకు అమ్మకాలు జరపడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని పళని సర్కార్ భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here