మద్యం మత్తులో కొట్టుకున్న రూమ్‌మేట్స్.. ఒకరి మృతి.. విశాఖలో విషాదం

లాక్‌డౌన్‌తో మూతపడిన మద్యం దుకాణాలు ఒక్కసారిగా తెరుచుకోవడంతో మందుబాబుల ఆగడాలు మొదలయ్యాయి. వైన్ షాపులు తెరవడంతో కొందరు ఫుల్లుగా మద్యం తాగి గొడవలకు దిగిన ఘటనలు వెలుగుచూశాయి. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వలసొచ్చిన ఇద్దరు స్నేహితులు మద్యం మత్తులో గొడవపడి దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణ కారణంగా ఒకరు మృతి చెందిన విషాద ఘటన విశాఖపట్నంలో జరిగింది.

ఒడిశాకు చెందిన ఇద్దరు స్నేహితులు నగరంలోని ఇసకతోట బస్టాప్ వెనుక ప్రాంతంలో రూమ్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. నిన్న మద్యం షాపులు తెరవడంతో ఇద్దరూ మద్యం తెచ్చుకుని తాగారు. ఈ క్రమంలో డబ్బుల విషయమై వివాదం రేగడంతో మద్యం మత్తులో ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు.

Also Read:

విచక్షణా రహితంగా కొట్టుకోవడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ని పిలిపించి ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here