మద్యం తాగితే నరహంతకుడే.. 33ఏళ్ల క్రితం తల్లి.. ఇప్పుడు కొడుకు హత్య

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. మద్యం విషయంలో భార్యతో గొడవపడుతుండగా అడ్డొచ్చాడన్న కోపంతో కన్న కొడుకునే తుపాకీతో కాల్చి చంపేశాడో వ్యక్తి. మద్యం తాగొద్దని చెప్పినందుకు 33ఏళ్ల క్రితం కన్నతల్లినే చంపేసిన.. ఆ వ్యక్తి ఇప్పుడు కొడుకును పొట్టన పెట్టుకున్నాడు. ఢిల్లీలోని రోహినీ ఏరియాకు చెందిన ఓమ్‌పాల్‌ వ్యాపారస్తుడు. చాలాఏళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు ఎంతగా చెప్పినా తన పద్ధతి మార్చుకోవడం లేదు.

Also Read:

మద్యం తాగొద్దని హెచ్చరించిన కన్నతల్లినే 33ఏళ్ల క్రితం(1987)లో చంపేపి జైలుశిక్ష అనుభవించి వచ్చాడు. అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోని ఓమ్‌పాల్‌ రోజూ మద్యం తాగుతూ భార్య పవిత్రా దేవితో గొడవపడేవాడు. కారణంగా కొద్దిరోజుల పాటు వైన్‌షాపులు మూత పడటంతో ఓమ్‌పాల్ ప్రశాంతంగా ఉన్నాడు. కొద్దిరోజుల నుంచి మద్యం విక్రయాలు మొదలు కావడంతో ఇష్టం వచ్చినట్లు తాగుతూ కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు.

Also Read:

మంగళవారం మద్యం తాగి వచ్చిన ఓమ్‌పాల్‌ను భార్య పవిత్రా దేవి నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వారి గొడవతో విసిగిపోయిన కొడుకు మధ్యలో వచ్చి తండ్రితో వాదనకు దిగాడు. దీంతో రెచ్చిపోయిన ఓమ్‌పాల్ గదిలో ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో కొడుకును కాల్చి చంపాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఓమ్‌పాల్‌‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here