మంటలార్పేందుకు వెళ్లి ఫైర్ ఆఫీసర్ సజీవదహనం.. అనంతపురంలో విషాదం

మంటలార్పేందుకు వెళ్లిన అగ్నిమాపక దళ అధికారి అగ్నికి ఆహుతైన విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మంటలు ఆర్పేందుకు వెళ్లి అగ్నికీలల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన మండలంలో జరిగింది. మండలంలోని రాంపురం సమీపంలోని గుజిరి గోడౌన్‌లో ఆదివారం భారీ సంభవించింది.

అగ్నికీలకు ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. తక్షణం స్పందించిన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రయత్నంలో ఫైర్ ఆఫీసర్ పరంధామ ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకున్నాడు. అగ్నికీలల నుంచి బయటపడలేక సజీవ దహనమయ్యాడు.

Also Read:

మంటలు భారీస్ధాయిలో ఎగసిపడుతుండడంతో అదుపుచేయడం సాధ్యం కావడం లేదు. ఇప్పటికే కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. మంటలు ఆర్పేందుకు వచ్చి సిబ్బంది అగ్నికి ఆహుతి కావడం స్థానికులను కలచివేసింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here