భార్య న్యూడ్ వీడియోలు బూతు సైట్లో పెట్టిన భర్త.. కారణం తెలిస్తే షాకే

అగ్నిసాక్షిగా పెళ్లాడి జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్తే భార్య పరువు తీశాడు. పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు నిలదీసిందన్న కక్షతో ఆమె స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీసి పోర్న్ సైట్లో అప్‌లోడ్ చేశాడు. అంతటితో ఆగకుండా తన భార్య డబ్బుల కోసం బూతు వీడియోలు తీస్తోందని ప్రచారం చేశాడు. రాజధాని కోల్‌కతాకు చెందిన రవి(పేరుమార్చాం) ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి సోనీ(పేరు మార్చాం) అనే మహిళతో కొంతకాలం క్రితం వివాహమైంది.

Also Read:

హాయిగా సాగిపోతున్న వీరి కాపురంలోకి మౌనిక అనే యువతి ప్రవేశించింది. తన ఆఫీసులో పనిచేసే మౌనికపై రవి మనసు పారేసుకున్నాడు. ఆమెను తన మాయమాటలతో లొంగదీసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన సోనీ నిఘా పెట్టగా అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె ఈ విషయాన్ని కుటుంబసభ్యులు, బంధువులకు చెప్పి పంచాయతీ పెట్టింది. పద్ధతి మార్చుకుని భార్యతో బుద్ధిగా కాపురం చేయాలని అందరూ రవికి చీవాట్లు పెట్టారు. దీంతో తన పరువు తీసిన భార్యపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనుకున్నాడు రవి.

Also Read:

భార్యకు తెలియకుండా బాత్రూమ్, బెడ్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు అమర్చాడు. సోనీ స్నానం చేస్తున్నప్పుడు, బట్టలు మార్చుకున్నప్పుడు వీడియోలు తీసి వాటిని పోర్న్ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశాడు. ఆ లింకులను బంధువులకు పంపించి.. తన భార్య డబ్బుల కోసం నగ్న వీడియోలు తీసి నీచానికి పాల్పడుతోందని ప్రచారం చేశాడు. ఇదంతా తన భర్త పన్నాగమని భావించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీ సాయంతో ఆమె భర్తే ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. రవితో పాటు అతడి ప్రియురాలు మౌనికపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here