భార్య చేతివేళ్లు నరికే యత్నం, భర్త అరెస్ట్.. షాకిచ్చిన ఆడపడుచు

లాక్‌డౌన్ ఇంట్లోనే ఉంటున్న భర్త తన చేతి వేళ్లు నరికేందుకు యత్నించాడని భార్య పోలీసులను ఆశ్రయించింది. పొడవాటి కత్తితో వేళ్లు నరికి వేరుచేసేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు భర్తని అరెస్టు చేశారు. అయితే ఆమెకు ఆడపడుచు రూపంలో ఊహించని షాక్ తగిలింది. వదినపై ఫిర్యాదు చేసిన ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఈ ఘటన కోల్‌కతాలో వెలుగుచూసింది.

నగరంలోని బ్యాలీగంజ్ డియోదర్ వీధికి చెందిన వివాహిత తన భర్త తనపై హత్యా యత్నం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న భర్త క్రూరంగా హింసిస్తున్నాడని.. కత్తితో తన చేతివేళ్లు నరికేందుకు యత్నించాడని ఫిర్యాదు చేయంతో పోలీసులు భర్తపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితురాలిని స్వస్తిక్ సేవా సదన్ ఆస్పత్రికి తరలించి ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు.

Also Read:

అయితే అసలు బాధితురాలిని తానంటూ భర్త చెల్లెలు.. వివాహితకి స్వయానా ఆడపడుచు షాకిచ్చింది. తన వదిన కత్తితో తనపై దాడి చేసిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కత్తితో దాడి చేయడంతో తనకు గాయాలయ్యాయని చెప్పడంతో పోలీసులు ఆమెను శంభునాథ్ పండిట్ ఆస్పత్రికి తరలించారు. పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ వదిన, ఆడపడుచుల పోరులో ఎవరు చెప్పేది నిజమో విచారణలో తేలాల్సి ఉంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here