భార్యపై కోపం.. ఐదు నెలల బిడ్డని చంపేసిన కసాయి భర్త

భార్యతో గొడవపడి బిడ్డని చంపేశాడో దుర్గార్గుడు. ముక్కుపచ్చలారని ఐదు నెలల పసికందుని అమానుషంగా హత్య చేశాడు. రాత్రి తనతో నిద్రపోయిన బిడ్డ తెల్లారేసరికి శవమై కనిపించకపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అచేతనంగా పడి ఉన్న కూతురిని తీసుకుని పరుగున ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణెలో వెలుగుచూసింది.

భార్యపై కోపంతో ఐదు నెలల పసికందుని కన్నతండ్రి గొంతుపిసికి చంపేసిన దారుణ ఘటన నగరంలోని బావ్‌ధాన్ ఏరియాలో చోటుచేసుకుంది. క్షత్రియనగర్‌కి చెందిన బాపురావ్ జాదవ్‌ నిత్యం భార్యతో గొడవలు పడుతుండేవాడు. ఓ రోజు ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకోవడంతో భార్యపై కోపంతో కన్నకూతురిని దారుణంగా చంపేశాడు. అభంశుభం తెలియని చిన్నారిని గొంతుపిసికి హత్య చేశాడు.

Also Read:

రాత్రి తనతో పడుకున్న కూతురు కనిపించకపోయే సరికి భార్య ఇల్లంతా వెతికింది. కూతురు గురించి భర్తని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఇంటి బయట అచేతనంగా పడి ఉన్న చిన్నారిని తీసుకుని వెంటనే ఆస్పత్రికి వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here