భారత్‌ను నిలబెట్టే ఐదు పిల్లర్లు ఇవే: ప్రధాని మోదీ

క రోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం నుంచి తేరుకొని పురోగమించడానికి గల వ్యూహాలకు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ రూ.20 లక్షల కోట్లతో ప్రధాని మోదీ మంగళవారం (మే 12) రాత్రి భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలో భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి అర్థమైందని.. ఇక భవిష్యత్తు అంతా మనదేనని మోదీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఐదు పిల్లర్లే భారత్‌ను నిలబెడతాయని అన్నారు. ఆ ఐదు పిల్లర్లు ఏమిటో చెప్పారు.

ప్రధాని చెప్పిన ఐదు పిల్లర్లు:

పిల్లర్ 1 – ఎకానమీ: భారీ కుదుపులకు లోను కాకుండా ఒక క్రమ పద్ధతిలో పురోగమించే భారత ఆర్థిక వ్యవస్థ.

పిల్లర్ 2 – ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారత్ సొంతం. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది.

పిల్లర్ 3 – వ్యవస్థ: సాంకేతికత ఆధారంగా నడిచే వ్యవస్థ. 21వ శతాబ్దపు ఆకాంక్షలు, స్వప్నాలను సాకారం చేసే అత్యాధునిక వ్యవస్థ.

పిల్లర్ 4 – డెమోగ్రఫీ: భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భౌగోళికపరంగానూ అతిపెద్ద దేశం. భారత్‌కు ఇది ప్రత్యేక గుర్తింపును ఇస్తోంది. ఇదే మన బలం.

పిల్లర్ 5 – డిమాండ్: డిమాండ్ – సరఫరా చెయిన్‌ను ప్రభావవంతంగా వినియోగించుకునే వ్యవస్థ భారత్‌కు ఉంది. సప్లై చెయిన్‌లోని అన్ని వర్గాల వారికి ఊతమిస్తూ మని డిమాండ్‌ను పూడ్చుకోవాల్సి ఉంది.

‘మనం బతకాలి.. బతికించుకుంటూ ముందుకెళ్లాలి’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారతీయ ఉత్పత్తులనే వినియోగించుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

‘21వ శతాబ్దం భారత దేశానిదే అని చెప్తుంటే విన్నాం. కరోనా సంక్షోభ సయమంలో అది చూస్తున్నాం. ఈ సంక్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలను ఆదుకునే అవకాశం వచ్చింది. భారత్ ఆపదను అవసరంగా మార్చుకుంటుందని ప్రపంచానికి నిరూపించి చూపించింది’ అని మోదీ అన్నారు. ఈ సంక్షోభ సమయంలో మరింత సమర్థంగా పనిచేయాలని.. సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here