బైక్ ఆపారని గొంతు కోసుకున్న వ్యక్తి.. షాక్‌లో పోలీసులు

సమయంలో బయటకు రావొద్దని పోలీసులు ఎంత చెప్పినా కొందరు పట్టించుకోవడం లేదు. బైకులు, కార్లలో ఇష్టారీతిగా బయట తిరుగుతూ పోలీసులను తలనొప్పులు తెస్తున్నారు. లాక్‌డౌన్ తొలినాళ్లలో ఇలా బయటకు వచ్చిన వారికి లాఠీలతో బుద్ధి చెప్పిన పోలీసులు ఇప్పుడు రకరకాల శిక్షలు వేస్తున్నారు. తనిఖీల్లో దొరికిన బైకులను సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇలాగే బైక్‌పై వెళ్తూ పోలీసులకు చిక్కిన ఓ వ్యక్తి భయంతో గొంతు కోసుకున్నాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన జిల్లా జగ్గంపేటలో సోమవారం జరిగింది.

Also Read:

సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన లోవరాజు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా సోమవారం బైక్‌పై వెళ్తుండగా జగ్గంపేటలో పోలీసులు ఆపారు. ఎక్కడికి వెళ్తున్నావని పోలీసులు ప్రశ్నిస్తుండగానే లోవరాజు తన దగ్గరున్న బ్లేడుతో గొంతు కోసేసుకున్నాడు. దీంతో షాకైన పోలీసులు అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆరా తీసిన సీఐ వై.రాంబాబు…మద్యం మత్తుతో ఉండటం, కుటుంబ కలహాలతోనే అతడు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసిందని చెప్పారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆరా తీశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here