నర్సు గెటప్‌లో ఆస్పత్రికి మేయర్… షాక్ అయిన సిబ్బంది

కరోనా ను కట్టడికి చేస్తున్న పోరాటంలో డాక్టర్లు, నర్సులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా రోగులకు వారు చేస్తున్న సేవలు చిరస్మరణీయం. అంతే కాదు… విధి నిర్వహణలో ఇప్పటికే అనేకమంది డాక్టర్లు.. నర్సులు ఈ వైరస్ బారిన పడ్డారు. పలు దేశాల్లో అయితే కరోనా పేషెంట్లకు చికిత్స అందించిన డాక్టర్లు కరోనా వైరస్ సోకి మరణించారు. అయితే పేషెంట్లు బాధలు ప్రత్యక్షంగా తెలుసుకున్న ఓ మేయర్ నర్సు గెటప్‌లో ఆస్పత్రిని సందర్శించారు. కిశోరీ పెడ్నేకర్ బీవైఎల్ నాయర్ హాస్పిటల్ ను నర్స్ డ్రెస్సులో సందర్శించారు. ఒకప్పుడు నర్సుగా పని చేసిన ప్రస్తుత ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ బీవైఎల్ నాయర్ హాస్పిటల్ ను ఆమె సందర్శించారు.

అక్కడ పనిచేస్తున్న సిబ్బంది యోగ క్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ…గతంలో తాను కూడా నర్సుగా పనిచేశానన్నారు. ఈ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు తనకు తెలుసన్నారు. నర్సింగ్ సిబ్బందికి ధైర్యం చెప్పేందుకే తాను నర్సు యూనిఫాంలో వెళ్లానని, ప్రస్తుత సంక్షోభ సమయంలో మనమంతా కలిసికట్టుగా నిలిచి పోరాటాన్ని కొనసాగించని సూచించారు. ఇక మేయర్ నర్స్ గెటప్ లో వెళ్లడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరికొందరు ఆమె చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇటీవలే మేయర్ కిశోరి పడ్నేకర్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆమెను కలిసిన ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె కూడా క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే ఆమెకు చేసిన పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చింది. 2001 వరకు ఆమె జేఎన్‌పీటీ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here