బీపీ పెరిగిందని మంత్రగాడి దగ్గరికెళ్లిన మహిళ.. శ్మశానంలోకి తీసుకెళ్లి..

బీపీ పెరిగిందని మహిళ మంత్రగాడి దగ్గరికెళ్తే శ్మశానంలోకి తీసుకెళ్లి రేప్ చేసిన దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బర్మేర్ జిల్లా ధోరిమన్న ప్రాంతానికి చెందిన మహిళ కొద్దిరోజులుగా హైబీపీతో బాధపడుతోంది. తల నొప్పి.. టెన్షన్‌గా ఉంటుండడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు మంత్రగాడు లాధురామ్ వైష్ణోయి దగ్గరికి తీసుకెళ్లారు. అతను ఓ కొబ్బరికాయ చేతిలో పెట్టి ఆమె పడుకో ప్రదేశంలో కట్టమని చెప్పి పంపించాడు.

ప్రత్యేక పూజల పేరుతో ఏకాదశి రోజున ఆమె ఇంటికి వెళ్లి పూజ చేశాడు. అనంతరం ఆమె తన స్వగ్రామం నుంచి వచ్చే సమయంలో ఆత్మ ఆవహించిందని చెప్పి భయపెట్టాడు. ఆ ఊరి శ్మశానంలో పూజలు చేయాలని చెప్పి నమ్మించి మహిళ, ఆమె భర్త, అతని సోదరుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు. శ్మశానంలో పూజలు చేసే సమయంలో ఎవరూ ఉండకూడదని చెప్పి ఆమె భర్త.. బావకి వేరే పనులు పురమాయించాడు.

Also Read:

అనంతరం సుమారు రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఆమెపై చేశాడు. పూజ చేస్తానని తీసుకెళ్లి ఆమెపై శ్మశానంలో రేప్ చేశాడు. విషయం భర్తకి చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు వైష్ణోయిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here