బాలికను రేప్ చేసి దారుణ హత్య.. స్నేహితుడిని పట్టించిన సీసీటీవీ ఫుటేజ్

బాలికను చేసి చంపేసి బావిలో పడేసిన అమానుష ఘటన రాజస్థాన్‌లోని భివడిలో వెలుగుచూసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలిక స్నేహితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేల్చారు. ఆమె శవం దొరక్కుండా అడవిలోకి తీసుకెళ్లి లోతైన బావిలో పడేసినట్లు తెలియడంతో మృతదేహాన్ని వెలికితీయించి నిందితుడిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

భివండి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు ఓ యువకుడిపై అనుమానం ఉందని చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. అతనిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో ప్రశ్నించడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికతో స్నేహం నటించిన యువకుడు ఆమెను కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.

Also Read:

బాలికను రేప్ చేసిన అనంతరం ఆమెను దారుణంగా చంపేసిన యువకుడు శవాన్ని మాయం చేసేందుకు పక్కా ప్లాన్ చేశాడు. బాలిక శవాన్ని అడవిలోకి లాక్కెళ్లి సుమారు 200 అడుగుల లోతు ఉన్న బావిలో ఆమె మృతదేహాన్ని పడేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడి కదలికలను గమనించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు బాలికను కలసినట్లు నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాలికను హత్య చేసి బావిలో పడేసినట్లు చెప్పడంతో క్రేన్ సాయంతో ఆమె శవాన్ని వెలికితీయించారు. యువకుడిపై హత్య, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసి జైలుకి పంపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here