బాలికను ఎత్తుకుపోయి మతం మార్చి పెళ్లాడిన ముస్లిం వ్యక్తి.. పాక్‌లో దారుణం

పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై తరుచూ జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అక్కడ ఎలాంటి మార్పు రావడం లేదు. హిందువులపై దాడులు చేయడమే కాకుండా.. ఆ వర్గానికి మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. వేల మంది హిందూ, సిక్కు మతాలకు చెందిన బాలికలను కిడ్నాప్ చేసి ఇస్లాం మతంలోకి మార్చేస్తున్నారు అక్కడి ఛాందసవాదులు. తర్వాత ముస్లిం యువకులు, వృద్ధులతో వారికి బలవంతంగా పెళ్లి చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.

Also Read:

తాజాగా పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో 14ఏళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి కొందరు ఆమెను ఇస్లాం మతంలోకి మార్చేశారు. అంతటితో ఆగకుండా మహ్మద్ ఆచార్ అనే 40 ఏళ్ల వ్యక్తితో ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మహ్మద్ ఆచార్ అనే వ్యక్తి గతంలోనూ అనేక మంది మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Also Read:

బాధితురాలి చేతిని పట్టుకుని నిఖాకు సంబంధించిన పేపర్లతో మహ్మద్ ఆచార్ దిగిన ఫోటో సోషల్‌మీడియాలో తిరుగుతోంది. ఈ ఘటనపై పాకిస్థాన్‌లోని మైనార్టీ సంఘాలు భగ్గుమంటున్నాయి. యుక్త వయస్సు రాకుండానే బాలికలను కిడ్నాప్ చేసి నిఘా పేరుతో వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, దీనిపై పాక్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మైనార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సింధ్ ప్రాంతంలో ఇలాంటి ఘోరాలు తరుచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వేల మంది హిందూ, క్రిస్టియన్‌, సిక్కు యువతులను కిడ్నాప్‌ చేసి ఇస్లాంలోకి మార్చి వివాహాలు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా నిఘా చేసుకున్న బాలికలను లైంగిక అవసరాలు తీర్చే బానిసలుగానే మార్చుకుంటారని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here