బస్సులు, ప్రజా రవాణా త్వరలోనే ప్రారంభం: కేంద్రం

ప్ర జా రవాణా త్వరలో ప్రారంభం అవుతుందని కేంద్రం తెలిపింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 24 నుంచి ఆగిపోయిన ప్రజా రవాణా వ్యవస్థను పున:ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. రవాణా, జాతీయ రహదారుల పునరుద్ధరణ ప్రజలకు భరోసా కల్పిస్తుందని ఆయన అన్నారు. అయితే బస్సులు, కార్లు తదితర వాహనాలు నడపడంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోక తప్పదని అన్నారు.

బుధవారం (మే 6) భారత బస్సులు, కార్ల ఆపరేటర్ల సమాఖ్య సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి గడ్కరీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. అటు కరోనాపై, ఇటు ఆర్థిక మాంద్యంపై జరుగుతున్న పోరులో భారత్ విజయం సాధించి తీరుతుందని గడ్కరీ పేర్కొన్నారు. కొంత కాలం వ్యక్తిగత రక్షణ చర్యలు పాటించాల్సిందేనని చెప్పారు.

చేతులు పదేపదే కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం లాంటివి తప్పనిసరి అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రవాణా రంగానికి వడ్డీ చెల్లింపు మినహాయింపులు, ప్రజా రవాణా పునరుద్ధరణ, రాష్ట్రాల పన్నుల వాయిదా లాంటి రాయితీలు సమకూర్చాలని సమాఖ్య సభ్యులు మంత్రిని కోరారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులను తిరిగి ప్రారంభించడానికి కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here