బంధువుల చేతిలో యువకుడి దారుణహత్య.. నెల్లూరు జిల్లాలో దారుణం

అసూయ, ఈర్ష్యా ద్వేషాలు ఓ యువకుడి దారుణ హత్యకు దారితీసిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన మేడేపల్లి వెంగళరావు (26) అనే యువకుడిని ఆయన బాబాయిలు మేడేపల్లి రామకృష్ణ, మేడేపల్లి నడిపి వెంగయ్య, మేనమామ కుమారుడు దొడ్ల శ్రీనివాసులు, మేనత్త కుమారుడు నాదెండ్ల వంశీకృష్ణ, వంశీకృష్ణ స్నేహితుడు కర్నాటి వెంకటేష్‌లు పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చారు. వెంగళరావు ప్రవర్తన నచ్చకపోవడం, అతడిపై అసూయ, ఈర్ష్యా ద్వేషాలు పెంచుకున్న నిందితులు ఈ నెల ఒకటో తేదీన రాత్రి అతడు తాగే పాలల్లో నిద్రమాతలు కలిపారు. ఆ పాలు తాగిన వెంగళరావు అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు.

Also Read:

అనంతరం నిందితులు తాడుతో వెంగళరావు గొంతుకు బిగించి చంపేశారు. మృతదేహాన్ని వింజమూరు- గుండెమడకల రోడ్డులో వెంకటాద్రిపాలెం స్టేజీ సమీపంలో కందకంలో వేసి మట్టితో కప్పేశారు. అతడి కారును దుత్తలూరు మండల పరిధిలోని ఓ ప్రాంతంలో దాచారు. వెంగళరావు కనిపించకపోవడంతో వరుసకు సోదరుడైన గుంటుపల్లి రమేష్‌ ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానంతో మేడేపల్లి రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read:

నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం సోమవారం తహసీల్దారు సుధాకరరావు, కావలి డీఎస్పీ డి.ప్రసాద్‌, కలిగిరి సీఐ కె.రవికిరణ్‌, ఎస్సై బాజిరెడ్డిల సమక్షంలో ఆ ప్రాంతంలో తవ్వి శవాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని కావలి డీఎస్పీ డి. ప్రసాద్ తెలిపారు. యువకుడిని సొంత బంధువులే దారుణంగా చంపేసిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here