ఫిషింగ్‌కి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి.. మేడ్చల్‌లో విషాదం

ఫిషింగ్ సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలిగొంది. పాఠశాలలకు సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటున్న అన్నదమ్ములు చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో పడి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన రాము అనే వ్యక్తి బతుకుదెరువు కోసం మేడ్చల్ జిల్లాకు వలసొచ్చి తుంకుంటా మున్సిపాలిటీ పరిధిలోని ఒక తోటలో కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు.

లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు లేకపోవడంతో అతని ఇద్దరు పిల్లలు వెంకటరమణ (11), దుర్గ ప్రసాద్(10) తుంకుంటా గ్రామ శివారులోని రాంరెడ్డి కుంటలో చేపలు పట్టడానికి వెళ్లారు. చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడి మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న శామీర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమ్మితం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here