కరోనాతో కలిసి జీవించడమెలాగో నేర్చుకోవాలి: లవ్ అగర్వాల్

దే శంలో కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల రేటు పెరుగుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య సంయుక్త కార్యదర్శి తెలిపారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1273 మంది కోలుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రికవరి రేటు 29.36 శాతంగా ఉందని చెప్పారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు.

దేశంలోని 216 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదని లవ్ అగర్వాల్ వెల్లడించారు. గడిచిన 28 రోజుల్లో దేశంలోని 42 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని చెప్పారు. అదేవిధంగా గత 21 రోజులుగా 29 జిల్లాల్లో; 14 రోజులుగా 36 జిల్లాల్లో; వారం రోజులుగా 46 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదని వివరించారు. భారత్‌లో ప్రస్తుతం 37,916 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 16540 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు కోలుకుంటున్నారని వివరించారు.

Must Read:

జులై నాటికి దేశంలో కరోనా వైరస్ విజృంభణ స్థాయికి చేరుకుంటుందంటూ కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. ఈ అంశంపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ లవ్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు, జాగ్రత్తలను పాటించకపోతే కరోనా కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. స్వీయ నియంత్రణ చర్యలను తూ.చ. తప్పకుండా పాటించినప్పుడే వైరస్ వ్యాప్తి అదుపులో ఉంటుందని చెప్పారు. లేకపోతే కరోనాతో కలిసి జీవించడమెలాగో నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.

2.5 లక్షల మంది కూలీల తరలింపు

శ్రామిక్ రైళ్లలో ఇప్పటివరకు 2.5 లక్షల మంది వలస కూలీలను తరలించామని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. శుక్రవారం (మే 8) మరిన్ని రైళ్లను నడుపుతున్నట్లు చెప్పారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీలయులను తరలించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఇప్పటికే అబుదాబి నుంచి కోచికి రెండు విమానాలు వచ్చాయని.. సింగపూర్ నుంచి మరో విమానం వచ్చిందని తెలిపారు.

ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ జలాశ్వ యుద్ధనౌక.. మాల్దీవుల నుంచి 700 మందిని వెనక్కి తీసుకొస్తున్నట్లు పుణ్యసలీల తెలిపారు. భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలనుకునే వారిని కూడా పంపించడానికి కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here