ప్లాస్మా చికిత్సతో సానుకూల ఫలితాలు.. త్వరలో మరింత మందికి: కేజ్రీవాల్

కోవిడ్-19 బాధితులకు ప్లాస్మా చికిత్సతో సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అన్నారు. శుక్రవారం ఆన్‌లైన్ మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నలుగురు కరోనా బాధితులపై నిర్వహించిన ప్లాస్మా చికిత్స ట్రయల్స్‌లో సత్ఫలితాలు వెల్లడవుతున్నాయని, భయంకరమైన ఈ వ్యాధి ను ప్రజలను కాపాడగలమనే ఆశలు కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత మందికి ప్లాస్మా చికిత్స నిర్వహించనున్నట్టు తెలిపారు. ఢిల్లీ నగరంలో పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు ప్లాస్మా చికిత్స అందజేయడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరుతామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

అంతేకాదు, కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు తమ ప్లాస్మాను ఇవ్వడానికి ముందుకు రావాలని, దీని వల్ల పరిస్థితి విషమంగా ఉన్న బాధితుల ప్రాణాలను రక్షించవచ్చని పిలుపునిచ్చారు. కరోనా బాధితులకు ప్లాస్మా చికిత్స చికిత్స క్లినికల్ ట్రయల్స్‌కు సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ జరగాలని సూచించింది. ఐసీఎంఆర్ ప్రోటోకాల్ ప్రకారం.. కరోనా వైరస్ నుంచి కోలుకున్న బాధితుల నుంచి ప్లాస్మా సేకరించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని సూచించింది.

వైరస్‌ బారినపడి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మాతో చేసే చికిత్సను కన్వాలెసెంట్‌ అంటారు. సాధారణంగా మన శరీరంలోకి బయటి నుంచి వైరస్‌ ప్రవేశించినప్పుడు దాంతో పోరాడేందుకు యాంటీబాడీస్‌ విడుదలవుతాయి. అప్పుడు శరీరం తట్టుకుని నిలబడుతుంది. తట్టుకోలేని శరీరాలు రోగం బారిన పడతాయి. నయమైన తర్వాత కూడా యాంటీబాడీస్‌ రక్తంలో ఉండిపోతాయి. వీటితో చేసే కన్వాలెసెంట్‌ ప్లాస్మా థెరపీ ఒకరకంగా రక్తమార్పిడి లాంటిదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here