ప్రియుడితో రాత్రి గొడవ.. పొద్దున్నే శవమై తేలిన ప్రియురాలు

బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడి యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. హాస్టల్ గది తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడడంతో యువతి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

బిహార్‌లోని నలంద ప్రాంతానికి చెందిన అంజలి(19) వారణాసిలో బీఏ ఫస్టియర్ చదువుతోంది. చేత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్హట్టా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్‌లో ఉంటోంది. లాక్‌డౌన్ కారణంగా అంజలి హాస్టల్‌లోనే ఉండిపోయింది. సడెన్‌గా ఓ రోజు ఉదయం శవమై తేలింది. ఉదయాన్నే ఎంతసేపటికీ గది తలుపు తీయకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read:

పోలీసులు తలుపులు పగలగొట్టి చూడడంతో అంజలి ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. ఆమెను కిందకు దించి చూసేప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు ఫోరెన్సిక్ టీమ్‌ని రప్పించి ఆధారాలు సేకరించారు. అంజలి రూమ్‌మేట్‌ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయే ముందు రోజు రాత్రి అంజలి తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడిందని.. అందువల్లే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయమై ఎస్‌ఎస్పీ ప్రభాకర్ చౌధరి మాట్లాడుతూ మృతురాలికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్లు తెలిసిందని.. వాళ్లిద్దరూ చాటింగ్ చేసుకున్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని.. విచారణలో నిజాలు తెలుస్తాయన్నారు. ఆత్మహత్యకు లాక్‌డౌన్‌‌తో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here