అక్టోబర్ 15 వరకు దేశంలోని హోటళ్లు క్లోజ్.. పర్యాటక శాఖకే షాకిచ్చారు!

ప్రచారం: కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులన్నీ 2020 అక్టోబర్ వరకు మూసి ఉంటాయని పేర్కొంటూ.. వాట్సాప్‌‌తో ఇతర సోషల్ మీడియాల్లో ఓ లెటర్ వైరల్ అవుతోంది. భారత పర్యాటక శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది. సర్క్యులేట్ అవుతున్న లెటర్‌ మీద పర్యాటక మంత్రిత్వ శాఖ లోగో కూడా ఉండటం గమనార్హం.

ఈ లేఖలోని తొలి వాక్యమే సరిగా లేదు. , భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు.. అంటూ తప్పుడు తడకలుగా వాక్య నిర్మాణం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులన్నీ 2020, అక్టోబర్ 15 వరకు మూసి ఉంటాయని రెండో వాక్యంలో పేర్కొన్నారు.

టైమ్స్ ఫాక్ట్ చెక్ పాఠకుడు ఒకరు ఈ లేఖను వాట్సాప్ ద్వారా మాకు పంపారు. ఈ ప్రచారం నిజమేనా అని అడిగారు. ఆ లేఖతోపాటు హిందీలో ఉన్న సందేశాన్ని కూడా ఫార్వార్డ్ చేశారు.

నిజం ఏంటంటే..

ఇది ఫేక్ లెటర్. అక్టోబర్ 15 వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులను మూసివేస్తూ.. పర్యాటక శాఖ ఎలాంటి లేఖను జారీ చేయలేదు. ఇది పర్యాటక రంగాన్ని భయాందోళనలకు గురి చేస్తోందని.. పర్యాటక మంత్రిత్వ శాఖ ఎలాంటి లేఖను జారీ చేయలేదని.. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని కేంద్ర పర్యాటక శాఖ మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇది తప్పుడు ప్రచారం అని పేర్కొంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్‌ కూడా ట్వీట్ చేసింది. ఈ తప్పుడు ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని, పర్యాటక శాఖ దీన్ని జారీ చేయాలేదని సూచించింది.

వర్డిక్ట్: దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లను అక్టోబర్ 15 వరకు మూసివేస్తారని జరుగుతున్న ప్రచారం తప్పని టైమ్స్ ఫాక్ట్ చెక్ గుర్తించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here