ప్రాణం తీసిన టిక్‌టాక్‌ .. వీడియో తీస్తూ ఉరికి వేలాడిన వివాహిత?

విశాఖ జిల్లా పెందుర్తిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన మహిళ(28) భర్త ఆర్మీలో పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఆమె ఇద్దరు కుమార్తెలతో కలిసి వచ్చి అద్దె ఇంట్లో నివాసముంటోంది. భర్త ఖర్చుల కోసం నెలనెలా డబ్బులు పంపిస్తుండటంతో ఆమె ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేది. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌ వీడియోలు తీయడం ప్రారంభించి క్రమంగా దానికి బానిసైంది.

Also Read:

రోజూ అందంగా ముస్తాబై టిక్‌టాక్ వీడియోలు తీస్తూ అప్‌లోడ్ చేసేది. ఇలాగే సోమవారం మధ్యాహ్నం కూడా మేకప్ వేసుకుని ఓ వీడియో అప్‌లోడ్ చేసింది. తర్వాత కొద్దిసేపటికే గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. గదిలోకి వచ్చిన ఇద్దరు కుమార్తెలు తల్లిని చూసి గట్టిగా కేకలు వేశారు. దీంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను కిందికి దించగా అప్పటికే ప్రాణం పోయింది.

Also Read:

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆమె మృతి చెందిన రూమ్‌లోని సన్‌సైడ్‌పై సెల్‌ఫోన్ ఉండటాన్ని గమనించిన పోలీసులు… ఏదైనా టిక్‌టాక్‌ వీడియో చేసేందుకు ట్రై చేసినప్పుడు ఇలా జరిగిందా..? అని అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పెందుర్తి ఎస్‌ఐ శ్రీను తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here