ప్రపంచ వ్యాప్తంగా 30లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తున్నది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 30లక్షలు దాటాయి. ఈ రోజు ఉదయానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30,64,823కు చేరుకుంది. ఇక కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 2,11607కు చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా రోగుల సంఖ్య పది లక్షలు దాటేసింది. మహమ్మారి కాటుకు అగ్రరాజ్యంలో ఇంత వరకూ 56, 803 మంది మరణించారు. అమెరికాలో మృతులు, కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుతుంటే… ఇతర దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో మూడింట ఒక వంతు అమెరికాలోనే ఉండడం గమనార్హం.

ప్రస్తుతం 919746 మంది రికవరీ అవ్వడం వల్ల 1928133 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిలో 56281 కేసుల్లో పేషెంట్లు ICUలో ఉన్నారు. ఐతే… ఆదివారంతో పోల్చితే… ఈ కేసుల సంఖ్య దాదాపు వెయ్యి దాకా తగ్గింది. అయితే అదే సమయంలో స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్, కెనడా, ఇండియా, బ్రిటన్, టర్కీ, ఇరాన్, రష్యా, పెరు, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

రష్యాలో 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. స్పెయిన్‌లో కరోనా కేసులు 2,29,422 నమోదు అయ్యాయి. వీరిలో 23,521మంది మృతి చెందారు. ఇటలీలో 199,414 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… అందులో 26977మంది మృతిచెందారు. ఆ తర్వాత స్థానాల్లో ఫ్రాన్స్ , జర్మని, బ్రిటన్, టర్కి ఉన్నాయి.

మరోవైపు మన భారతదేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా కేసుల సంఖ్య 28380కి చేరగా… వాటిలో 6362 మంది రికవరీ అయ్యారు. మృతుల సంఖ్య 886కి చేరింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 8590 కేసులు నమోదు అయ్యాయి. 369 మంది మృతి చెందారు. మహా తర్వాత గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్, ఢిల్లీలో మూడువేలకు పైగా కేసులు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో రెండువేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here