పేకాట ఆడుతున్న రాజకీయ నేతల అరెస్ట్… లాక్‌డౌన్‌లో బోర్ కొడుతోందట

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన కొందరు నేతలు ఏకంగా ఫంక్షన్ హాల్‌లో పేకాట ఆడటం మొదలుపెట్టారు. ప్రభుత్వ హెచ్చరికలను పక్కన పెట్టి దర్జాగా పేకాట ఆడుతున్న నేతలు చివరికి పోలీసులకు చిక్కారు. తమకు బోర్ కొట్టడంతోనే పేకాట ఆడుతున్నట్లు వారు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. జిల్లాలోని పట్టణంలో ఏఎంకే ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ఉదయం కొందరు వ్యక్తులు గుంపుగా చేరడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also Read:

దీంతో నిర్మల్‌కు చెందిన సీసీఎస్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో పాటు ఖానాపూర్ పోలీసులు అక్కడ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో గుంపులుగా పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారందరూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలుగా పోలీసులు గుర్తించారు. దీంతో అందరినీ అదుపులోకి తీసుకుని ఖానాపూర్ పీఎస్‌కు తరలించారు. సంఘటనా స్థలం నుంచి రూ.1.60లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఖానాపూర్ ఎస్ఐ భావనిసేన్ తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here