గ్రామాలు బలంగా ఉంటేనే దేశంలో అభివృద్ధి.. సర్పంచ్‌లతో కాన్ఫరెన్స్‌లో మోదీ

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పలువురు సర్పంచ్‌లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచ్‌లకు మోదీ మార్గనిర్దేశం చేశారు. కరోనా వైరస్ గురించి గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, మనం పయనించే దారిలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో అత్మనిర్భరంతో ఉండాలని.. ఈ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత బలపడితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యంతో ముందకు సాగాలన్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలపై సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు ఎనలేని కృషి చేస్తున్న సర్పంచులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. కరోనాపై గ్రామ ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాలని అన్నారు.

గ్రామాల్లో సుపరిపాలనకు పంచాయతీ రాజ్ సంస్థ ఎంతగానో కృషిచేస్తోందని ప్రశంసించారు. గ్రామాల్లో మెరుగైన సేవల అందించి పురస్కారాలు సాధించిన సర్పంచ్‌లను ప్రధాని అభినందించారు. ప్రస్తుతం లక్షా 15వేల గ్రామ పంచాయితీల్లో బ్రాండ్‌బ్యాండ్ సేవలు కొనసాగుతున్నాయని అన్నారు. గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ- గ్రామ్ స్వరాజ్, మొబైల్ యాప్ ద్వారా ఎన్నో సేవలు పొందవచ్చిన అన్నారు. ఈ-గ్రామ్ స్వరాజ్ ద్వారా బ్యాంకు రుణాలను కూడా సులభంగా పొందవచ్చిన ప్రధాని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here